Header Banner

వల్లభనేని వంశీకి మరోసారి షాక్.. మళ్లీ రిమాండ్‌ పొడిగింపు!

  Tue May 13, 2025 13:33        Politics

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట‌యిన వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మ‌ళ్లీ నిరాశేఎదురైంది. ఆయ‌న‌ రిమాండ్‌ను న్యాయ‌స్థానం మ‌రోసారి పొడిగించింది. రేప‌టి వరకు వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజుతో రిమాండ్ ముగియ‌నుండ‌టంతో పోలీసులు ఆయ‌న్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం వంశీ రిమాండ్‌ను రేప‌టి వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో ఆయ‌న‌ను పోలీసులు మ‌ళ్లీ విజ‌య‌వాడ జైలుకు త‌ర‌లించారు. ఇక‌, ఇదే కేసులో వంశీతో సహా మిగిలిన న‌లుగురు నిందితులు గంటా వీర్రాజు, శివ‌రామ‌కృష్ణ ప్ర‌సాద్‌, నిమ్మ చ‌ల‌ప‌తి, వేల్పూర్ వంశీబాబుల రిమాండ్ కూడా ఇవాళ్టితో ముగియ‌నుండ‌గా పోలీసులు కోర్టులో హాజ‌రుప‌రిచారు. వారి రిమాండ్‌ను కూడా న్యాయ‌స్థానం రేప‌టి వ‌ర‌కు పొడిగించింది.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VallabhaneniVamsi #TDPOffice #Attck #YSRCP #Arrest #Hyderabad